- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Women’s Day: మహిళలు ఒక హత్య చేస్తే శిక్షించొద్దు.. రోహిణి ఖడ్గే
మహిళా దినోత్సవం వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహిళా దినోత్సవం వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. మహిళలు ఒక హత్య చేస్తే వారికి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్లు అందులో పేర్కొన్నారు. మహిళలకు ఒక హత్యకు శిక్ష నుంచి ఇమ్యూనిటీ ఇవ్వాలని కోరారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. అణచివేత మనస్తత్వం, రేపిస్ట్ మెంటాలిటీ, శాంతిభద్రతల్లో నిర్లక్ష్య ధోరణిని మహిళలు చంపాలనుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. ఇటీవలే ముంబైలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ గురించి ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలను టార్గెట్ చేస్తూ.. రాష్ట్రపతికి లేఖ రాశారు. రాశారు. కిడ్నాప్, గృహ హింస వంటి నేరాలు మహిళలపై అత్యధికంగా భారత్ లోనే జరుగుతున్నాయన్న సర్వే నివేదికను కూడా ఉదాహరించారు. తమ డిమాండ్‌ని ఆలోచించిన తర్వాత అనుమతి మంజూరు చేస్తారని ఖడ్సే చెప్పుకొచ్చారు.
Read More ....
Murmu: దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము






