Viral Video : PM మోడీని చంపేస్తానని AK47 తో బెదిరించిన చిన్నారి

by Muthe.Rajitha |   (  Updated:2025-03-11 12:03:34  IST  )

ఓ ఆరేడేళ్ల వయసున్న చిన్నారి ఏకే 47 చేత పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)ని చంపేస్తానని బెదిరించడం(Threatenin to Kill Modi) సంచలనం రేపుతోంది.

Viral Video : PM మోడీని చంపేస్తానని AK47 తో బెదిరించిన చిన్నారి
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ ఆరేడేళ్ల వయసున్న చిన్నారి ఏకే 47 చేత పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)ని చంపేస్తానని బెదిరించడం(Threatenin to Kill Modi) సంచలనం రేపుతోంది. అయితే ఆ బాలిక ఎక్కడి నుంచి ఈ వీడియో చేసిందో తెలియదు కాని ప్రస్తుతం ఈ బెదిరింపు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ సదరు వీడియోలో ఏముందంటే.. "మిస్టర్ మోదీ.. నువ్వు ఎవరైనా కావొచ్చు, నువ్వు మరోసారి మా దేశాన్ని, అమ్మా, నాన్నలను, పిల్లలను చంపితే నీకు ఎదరుగా వచ్చి నేనే నిన్ను చంపేస్తాను. నువ్వొక తెలివి తక్కువ వాడివి, నా తుపాకీ చూశావుగా.. ఇందులో చాలా బుల్లెట్లు ఉన్నాయి.. 50 బుల్లెట్లు ఉన్నాయి. ఇందులో రెండు రెండు బుల్లెట్లతో నిన్ను చంపేస్తాను. నువ్వు ఎప్పటికీ బ్రతక్కుండా చేస్తాను.. కనీసం వైద్యుడు కూడా నిన్ను బతికించలేడు.. నువ్వు ఎప్పటికీ భూమిలోనే చనిపోయి ఉంటావు. అల్లా కూడా నీతో సంతోషంగా ఉండడు. నువ్వెప్పటికీ దుర్వాసన వస్తూ ఉంటావు.." అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఆమె ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు.చిన్న పిల్లల చేతుల్లో మారణ ఆయుధాలు పెట్టి.. భారత ప్రధాని మోదీపై ఇంత కోపం పెంచుతున్నది ఎవరో తెలుసుకుని వారిని శిక్షించాలని ఓ నెటిజెన్ కామెంట్ చేయగా.. ఇది మన దేశానికి చెందిన వీడియోనే అయితే వెంటనే చిన్నారిని అదుపులోకి తీసుకోవాలని, ఆమెకిలా బ్రెయిన్ వాష్ చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని మరికొంత మంది నెటిజన్స్ మండిపడుతున్నారు.


Next Story