- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Girl suicide: ఫ్రెండ్‌కు లిఫ్ట్ ఇచ్చినందుకు తల్లి మందలింపు.. 16 ఏళ్ల బాలిక సూసైడ్
గుజరాత్‌లోని వడోదరలో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి తిట్టినందుకు గాను ఓ 16 ఏళ్ల బాలిక సూసైడ్ చేసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ (Gujarath) లోని వడోదరలో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి తిట్టినందుకు గాను ఓ 16 ఏళ్ల బాలిక సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక తన ఫ్రెండ్‌ను ప్రతి రోజూ బైక్‌పై తీసుకెళ్తోంది. దీనిని గమనించిన తల్లి బాలికను పలు మార్లు మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలిక రెండు రోజుల తర్వాత తన తల్లి ఇంట్లో లేని టైంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పని నిమిత్తం బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చే సరికి ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని తన తల్లికి రాసిన సూసైడ్ నోట్ గుర్తించారు. ‘అమ్మా నీ కూతురు నీ అదుపులో లేదు. అందరూ సంతోషంగా ఉండాలి. నేను వెళ్తున్నాను. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. లవ్ యూ అమ్మ’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






