కేరళలో బాలిక ప్రాణం తీసిన కొత్త వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాల్సిందే!

by Ajay Maddhiboyina |

కేరళలో మరో కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. మెదడును తినే అమీబా అనే అరుదైన వ్యాధి కారణంగా ఓ బాలిక కన్నుమూసింది. ఈ ఘటన కోజికోడ్ జిల్లా తామరస్సేరి ప్రాంతంలో చోటు చేసుకుంది.

కేరళలో బాలిక ప్రాణం తీసిన కొత్త వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో మరో కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. మెదడును తినే అమీబా అనే అరుదైన వ్యాధి కారణంగా ఓ బాలిక కన్నుమూసింది. ఈ ఘటన కోజికోడ్ జిల్లా తామరస్సేరి ప్రాంతంలో చోటు చేసుకుంది. తామరస్సేరికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఈ వైరస్ సోకడం వల్ల మరణించింది. ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది. బాలికకు ఈ నెల 13వ తేదీన తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలికకు జ్వరం తగ్గకపోవడం, తీవ్రమైన తలనొప్పి మరియు జ్వరం రావడంతో అక్కడ నుండి కోజికోడ్ లోని వైద్య కళాశాలకు తరలించారు.

అయినప్పటికీ బాలిక పరిస్థితి పూర్తిగా విషమించి కన్నుమూసింది. కాగా వైద్య పరీక్షల్లో అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ అనే వ్యాధితో మరణించిందని నిర్దారించారు. ఈ ఏడాది ఇదే జిల్లాలో వ్యాధికి సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయి. కలుషిత నీటి వల్ల సోకే ఈ వ్యాధి నలుగురికి సోకడంతో జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక వ్యాధి గురించి డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు. ఈ వైరస్ మనం తాగే నీటి ద్వారా మెదడకు చేరుతుందని చెప్పారు. అంతే కాకుండా మెదడులో పునరుత్పత్తి చేస్తూ మెదడు భాగాలను సైతం దెబ్బ తీస్తుందని తెలిపారు. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు, జ్వరం లాంటి లక్షణాలతో చివరికి మరణం సంభవించవచ్చని పేర్కొన్నారు. కాబట్టి శుభ్రమైన, వేడి చేసి చల్లార్చిన నీటిని తాగటం ఉత్తమం అని సూచించారు.

Next Story