ఐదో అంతస్తు నుంచి దూకేందుకు బాలిక యత్నం.. ఎన్ఆర్ఐ లేఅవుట్‌లో ఉద్రిక్తత

by Ramesh Naini |

బెంగళూరులోని రామమూర్తినగర్ పరిధిలో ఉన్న ఎన్ఆర్ఐ (NRI) లేఅవుట్‌లో గురువారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఐదో అంతస్తు నుంచి దూకేందుకు బాలిక యత్నం.. ఎన్ఆర్ఐ లేఅవుట్‌లో ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని రామమూర్తినగర్ పరిధిలో ఉన్న ఎన్ఆర్ఐ (NRI) లేఅవుట్‌లో గురువారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలిక ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా.. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఆమెను సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఓ బాలిక అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తుపైకి ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కేకలు వేసింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అప్రమత్తమై 112 అత్యవసర నంబర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న హొయసల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో, చాకచక్యంగా వ్యవహరించి ఆ బాలికను ప్రాణాపాయం నుంచి రక్షించారు.

తల్లిదండ్రులతో గొడవ..?

అనంతరం ఆమెకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం, కౌన్సెలింగ్ కోసం నిమ్హాన్స్ (NIMHANS) ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులతో గొడవలు లేదా ఇతర సమస్యల వల్లే బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై రామమూర్తినగర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యాయత్నానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story