- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Girija Vyas: మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ (79) కన్నుమూశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ (79) కన్నుమూశారు. మార్చి 31న తన ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవ శాత్తు వ్యాస్ కండువాకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను అహ్మదాబాద్ లోని బైడస్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వ్యాస్ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గురువారం తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గిరిజ అంత్యక్రియలు శుక్రవారం ఉదయ్ పూర్ లో జరుగుతాయని వెల్లడించారు. గిరిజా వ్యాస్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), కేసీ వేణుగోపాల్ (Kc venugopal) సహా పలువురు సంతాపం తెలిపారు.
కాగా, 1946న జూలై 8న జన్మించిన గిరిజా వ్యాస్ తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఆ తర్వాత 1991, 1996,1999లో ఉదయపూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించారు. అంతేగాక రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గా, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గానూ పని చేశారు.






