ఛీ.. ఛీ.. జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్ముతున్న వ్యక్తి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జనం.. (వీడియో)

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కాంవర్ యాత్ర మార్గంలో జ్యూస్ కార్నర్ నడుపుతున్న అమీర్ ఖాన్ అనే వ్యక్తి.. ఫ్రూట్ జ్యూస్‌లో యూరిన్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

ఛీ.. ఛీ.. జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్ముతున్న వ్యక్తి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జనం.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కాంవర్ యాత్ర మార్గంలో జ్యూస్ కార్నర్ నడుపుతున్న అమీర్ ఖాన్ అనే వ్యక్తి.. ఫ్రూట్ జ్యూస్‌లో యూరిన్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతను ఆ పని చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జనం.. దాడికి దిగారు. అతనితోపాటు, సహాయకుడిని పోలీసులకు అప్పగించారు. జ్యూస్ సెంటర్ నుంచి లీటర్ మూత్రం ఉన్న ప్లాస్టిక్ కంటైనర్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సెక్షన్ 272, 274, 275 కింద కల్తీ, హానికరమైన ఆహారం విక్రయించడంపై కేసు నమోదు చేశారు. మూత్రాన్ని పరీక్ష కోసం లాబొరేటరీకి పంపించారు. కాగా అమీర్ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోవడంతో అరెస్టు చేయబడినట్లు సమాచారం.

VIDEO

Next Story