- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'Not Okay With Muslims': త్వరలో పెళ్లి.. నాకెవ్వరూ అద్దెకు ఇళ్లివ్వడం లేదు.. బెంగళూరులో ఐఐటీ గ్రాడ్యుయేట్ కు వింత అనుభవం
బెంగళూరులో ఐఐటీ గ్రాడ్యుయేట్ కు వింత అనుభవం ఎదురైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మన దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలను బట్టి మనుష్యులను అంచనావేసే అనవాళ్లు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అద్దె ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి టు-లెట్ బోర్డు వెనకాల కులం, మతం బోర్డులు చిర్రెత్తిస్తున్నాయి. తమ కులం వారికే అని కొందరు, తమ మతం వారికే అద్దెకిస్తామని మరి కొందరు తెగేసి చెప్పేవారు సమాజంలో పెరిగిపోతున్నారు. రెంట్ కు వచ్చే వారు ఉన్నత విద్యావంతులైనా, మంచి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నా తమ కులం, మతం కాకుంటే యజమానులు మాకక్కర్లేదని తెగేసి చెప్పేస్తున్నారు. తాజాగా ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ తనకు బెంగళూరులో (Bengaluru) ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ముస్లిం అనే కారణంతో తనకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన మహ్మద్ సంజీద్ కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. త్వరలో పెళ్లి చేసుకుని కుటుంబ జీవింతంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన ఇటీవల బెంగళూరులో ఇంటికోసం వెతకడం ప్రారంభించాడు. మే 24న ఇందిరా నగర్, కోరమంగళ్ లో డబుల్ బెడ్ రూమ్ కోసం ప్రయత్నాలు చేశాడు. బ్రోకర్లతో కలిసి దాదాపు 4 ప్రదేశాలను వెతుకులాట ప్రారంభించాడు. కానీ బ్రోకర్లు సైతం చివరకు క్షిమించండి అంటూ సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ తో ఉద్రిక్తతల కారణణంగా యజమానులు ముస్లింలకు ఇళ్లను అద్దెకు ఇవ్వడానికి అనుకూలంగా లేరని (Not Okay With Muslims) చెప్పినట్లు సంజీద్ ఆవేదనతో కూడిన పోస్టును ఎక్స్ లో పోస్టు చేశాడు. బెంగళూరులో ఇస్లామోఫోబిక్ కాని ఏరియాలో ఏమిటో తెలిస్తే చెప్పండి ఆ ఏరియాలోనే ఇంటిని వెతికే ప్రయత్నం చేస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంజీద్ చేసిన పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్య పట్ల క్షమాపణలు కోరుతున్నారు. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదని పలువురు అతడికి సూచనలు చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ నేను ఇటీవలే పెళ్లి చేసుకున్నాను. మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను. మీకు ఇళ్లు దొరికే వరకు మాతో ఉండండి అంటూ స్నేహహస్తం అందించాడు. సంజీద్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






