- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Germany: జర్మనీలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
జర్మనీలో మరో కారు ప్రమాదం జరిగింది. మ్యాన్‌హీమ్ నగరంలో ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: జర్మనీ (Jarmany)లో మరో కారు ప్రమాదం జరిగింది. మ్యాన్‌హీమ్ (Manheem) నగరంలో ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. నగరంలో ప్రధాన కేంద్రంగా ఉన్ పారాడెప్లాట్జ్ నుంచి ల్యాండ్ మార్క్ టవర్ వైపు ప్రయాణిస్తున్న కారు అధిక వేగంతో వచ్చి జనంపైకి దూసుకెళ్లిందని స్థానిక కథనాలు వెల్లడించాయి. కార్నివాల్ సీజన్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు గుమిగూడిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఘటన అనంతరం ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారా, లేక పొరపాటున ప్రమాదం జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
జర్మనీలో కారు ప్రమాద ఘటనలు జరగడం సర్వ సాధారణంగా మారింది. అంతకుముందు జనవరిలో ఒక ఆఫ్ఘన్ శరణార్థి మ్యూనిచ్ నగరంలో ప్రజలపైకి తన కారును వేగంగా తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 28 మంది గాయపడ్డారు. గతేడాది డిసెంబర్‌లోనూ మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో వేగంగా వచ్చిన కారు ప్రజల పైకి దూసుకెళ్లింది. ఈ దాడిలో ఐదుగురు మరణించగా 200 మంది గాయపడ్డారు. మూడు నెలల వ్యవధిలోనే వరుస ఘటనలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.






