- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్మనీ ఛాన్సలర్‌గా ఫ్రెడ్రిక్ మెర్జ్
ఎన్నికల ఫలితాల తర్వాత మెర్జ్, ఓలాఫ్ స్కూల్జ్‌లు మహా కూటమి ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

- ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన కన్జర్వేటీవ్ కూటమి
- రెండో స్థానంలో ఏఎఫ్‌డీ, మూడో స్థానంలో ఎస్పీడీ
- ఎస్పీడీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న మెర్జ్?
దిశ, నేషనల్ బ్యూరో: జర్మనీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫ్రెడ్రిక్ మెర్జ్ నేతృత్వంలో సీడీయూ, సీఎస్‌యూల కన్జర్వేటీవ్ కూటమి ఎక్కువ ఓట్ షేర్ సాధించింది. 30 శాతం ఓట్ షేర్ సాధించాలని కన్జర్వేటీవ్ కూటమి లక్ష్యంగా పెట్టుకున్నా.. 28.5 శాతం వద్దే ఆగిపోయింది. ఆల్టర్నేటీవ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) తమ ఎన్నికల చరిత్రలో అత్యుత్తమ ఓట్ షేర్ (20.8 శాతం) సాధించింది. ప్రస్తుత ఛాన్సలర్ ఓలాఫ్ స్కూల్జ్‌కి చెందిన ఎస్పీడీ 10 శాతం ఓటింగ్ షేర్ పొందింది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఎస్పీడీ ఇప్పటి వరకు సాధించిన అత్యంత చెత్త ఫలితాలు ఇవే కావడం గమనార్హం. కాగా, జర్మనీ ఛాన్సలర్‌గా ఫ్రెడ్రిక్ మెర్జ్ త్వరలోనే ప్రమాణం చేయనున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత మెర్జ్, ఓలాఫ్ స్కూల్జ్‌లు మహా కూటమి ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. జర్మనీ పార్లమెంట్ (బుందెస్టాగ్)లో మొత్తం 630 సీట్లు ఉన్నాయి. 316 సీట్లను గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే సీడీయూ, సీఎస్‌యూ పార్టీల కూటమి 28.5 శాతం ఓట్లతో 208 సీట్లు గెలిచింది. ఇక ఓలాఫ్ స్కూల్జ్‌కు చెందిన ఎ్పీడీ 16.4 ఓట్ల షేరింగ్‌తో 121 సీట్లు తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.ఈ రెండు పార్టీలు మహా కూటమిగా ఏర్పడితే 329 సీట్లు పొందుతారు. ఇది మెజార్టీ మార్క్‌ను దాటిపోతుంది. కాగా కాబోయే ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడుతూ.. ఇవ్వాళ రాత్రంతా పార్టీ చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి మనం పని మొదలు పెట్టాలని వ్యాఖ్యానించారు.
ఇక ఏఎఫ్‌డీ నేత అలిస్ వీడెల్ మాట్లాడుతూ.. జర్మన్లు మార్పు కోరుతూ ఓటు వేశారు. అయితే ఫ్రెడ్రిక్ మెర్జ్ మళ్లీ ఎస్పీడీతో కలిసి ప్రభుత్వన్ని ఏర్పాటు చేయడం అంటే ప్రజల తీర్పును అగౌరవ పరచడమే అని అన్నారు. ఈ మహాకూటమి ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది. మరోసారి ఎన్నికలు జరుగుతాయి. అందుకోసం నాలుగేళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని అలిస్ అన్నారు.






