- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనరల్ నరవణే పుస్తక వివాదం.. పబ్లిషింగ్ హౌస్ ‘పెంగ్విన్’కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే ప్రచురితం కాని ఆత్మకథకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పబ్లిషింగ్ హౌస్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే (M.M.Naravane) రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) అనే ప్రచురితం కాని ఆత్మకథకు సంబంధించి ఢిల్లీ పోలీసులు (Delhi Police) పబ్లిషింగ్ హౌస్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (Penguin Random House India)కు నోటీసులు జారీ చేశారు. అయితే, ఇప్పటికే అసలు ఆ పుస్తకం ప్రింటింగ్ ఎలా జరిగింది..? క్లియరెన్స్ రాక ముందే ప్రతులు ఎలా బయటకు వచ్చాయి..? అనే విషయాలపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు పెంగ్విన్ ఇండియాను సూచనాప్రాయంగా కోరారు. ఈ పుస్తకంలో అగ్నిపథ్ పథకం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల గురించి సంచలన విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act) ఏమైనా ఉల్లంఘించబడిందా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు.
కాగా, మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అధికారికంగా విడుదల కాలేదు. జాతీయ భద్రత, ముఖ్యంగా 2020 నాటి గాల్వన్ లోయ ఘర్షణలకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఇందులో ఉన్నందున ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహిస్తోంది. ముఖ్యంగా లోక్‌సభలో లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకం గురించి ప్రస్తావించడం, పుస్తకం ప్రతిని పట్టుకుని పార్లమెంట్ ఆవరణలో హల్‌చల్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.






