Gaza: గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు సహా 20 మంది మృతి

by B.Srinivas |

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని నాజర్ ఆస్పత్రిపై క్షిపణి దాడి చేసింది. రెండు మిస్సైల్స్‌ను వెంట వెంటనే ప్రయోగించింది.

Gaza: గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు సహా 20 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని నాజర్ ఆస్పత్రిపై క్షిపణి దాడి చేసింది. రెండు మిస్సైల్స్‌ను వెంట వెంటనే ప్రయోగించింది. ఈ దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో రాయిటర్స్, ఆల్ జజీరా జర్నలిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజా దాడిపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ ఆస్పత్రిలో హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్ ను నడుపుతున్నారని గతంలో ఆరోపించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నాజర్ ఆస్పత్రికి పదే పదే లక్ష్యంగా చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన దాడిలో ముగ్గురు మరణించగా, పది మంది గాయపడ్డారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ (Israel hamas) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 192 మంది జర్నలిస్టులు మరణించారు.

Next Story