యుద్ధంలో 59 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి: గాజా ఆరోగ్యశాఖ

by Phanindra |

యుద్ధంలో 59 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారని, 1.4 లక్షల మంది గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

యుద్ధంలో 59 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి: గాజా ఆరోగ్యశాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 59 వేలు దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఈ యుద్ధం దాదాపు 21 నెలలుగా జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో మొత్తం 59,029 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,42,135 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో సాధారణ పౌరులు, మిలిటరీ జవాన్లను వేరు చేయలేదని, అయితే మరణించిన వారిలో సగానికిపైగా మహిళలు, పిల్లలేనని అధికారులు స్పష్టంచేశారు.

Next Story