గాజాకు పంపే ఆహారంలో డ్రగ్స్ కలుపుతున్న ఇజ్రాయెల్?

by Phanindra |

గాజాకు పంపే ఆహారంలో డ్రగ్స్ కలుపుతున్న ఇజ్రాయెల్? కనీసం నాలుగు చోట్ల పిండి బ్యాగుల్లో దొరికినట్లు ప్రకటించిన గాజా ప్రభుత్వం!

గాజాకు పంపే ఆహారంలో డ్రగ్స్ కలుపుతున్న ఇజ్రాయెల్?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ మిలటరీ ద్వారా పాలస్తీనాకు పంపించే ఆహారంలో నార్కోటిక్స్ పిల్స్ కలుపుతున్నట్లు సంచలన విషయం వెలుగుచూసింది. యూఎస్ మద్దతుతో గాజా మిలిటరీ ఆధ్వర్యంలో పనిచేసే గాజా హ్యుమనిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్‌ఎఫ్) ఆహార పదార్థాలను పాలస్తీనాలోకి పంపుతోంది. అయితే ఇలా వచ్చిన పిండి పదార్థాల్లో ‘ఆక్సిటాసిన్’ పిల్స్ దొరికినట్లు గాజాకు చెందిన గవర్నమెంట్ మీడియా ఆఫీస్ (జీఎంవో) వెల్లడించింది.

దీనిపై కనీసం నలుగురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొన్ని పిల్స్‌ను పిండి చేసి ఆహారంలో కలిపేసి ఉంటారనే అనుమానాలు కూడా జీఎంవో వ్యక్తంచేసింది. ఇది నేరుగా ప్రజారోగ్యంపై చేస్తున్న దాడిగా జీఎంవో ఆరోపించింది. కాగా, శుక్రవారం నాడు ఇజ్రాయెల్ దాడుల్లో 62 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు సమాచారం. వీరిలో 10 మంది జీహెచ్‌ఎఫ్ కేంద్రం వద్ద ఆహారం అందుకునేందుకు ఎదురు చూస్తుండగా ఇజ్రాయెల్ దళాలు కాల్చి చంపాయని గాజా అధికారులు చెప్తున్నారు.

Next Story