- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gaza: గాజాలో భీకర దాడులు.. 146 మంది పాలస్తీనియన్లు మృతి
ఇజ్రాయెల్ సైన్యం గాజాలో భీకర దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ సైన్యం గాజా (Gaza)లో భీకర దాడులకు పాల్పడుతోంది. హమాస్ (Hamas)ను అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గాజాలోని పలు ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో ఇజ్రాయెల్ దాడుల వల్ల గత 24 గంటల్లోనే 146 మంది పాలస్తీనియన్లు (Palasthinians) ప్రాణాలు కోల్పోగా.. 459 మంది గాయపడ్డట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్ర సంస్థ హమాస్‌ను అంతమొందించే వరకు దాడులు తీవ్ర తరం చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. గాజా స్ట్రిప్‌లో కార్యకలాపాలను విస్తరించడానికి, విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వెల్లడించింది. ప్రతి రోజూ 150 లక్ష్యాలను టార్గెట్ చేస్తున్నామని తెలిపింది.
హమాస్‌పై పాలస్తీనియన్ల తిరుగుబాటు !
గాజాలో ఇజ్రాయెల్ దాడుల వల్ల భారీ నష్టం జరగడంతో పాటు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆహారం దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. గాజాకు సహాయం చేయడంపైనా ఇజ్రాయెల్ నిషేధం విధించింది. అయితే దీనంతటికీ కారణం హమాసేనని భావించిన పాలస్తీనియన్లు ఆ సంస్థపై తిరుగుబాటు చేస్తున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఉగ్ర వాద సంస్థలు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు సైతం చేస్తున్నట్టు తెలిపాయి. ఉత్తర గాజాలోని బీట్ లాహియా పట్టణంలో ఈ నిరసనలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నాయి. యుద్ధాన్ని త్వరగా ముగించాలని, గాజా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో గాజాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.






