- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gaza: గాజాలో సీజ్ ఫైర్ అవసరం.. మానవతా సంక్షోభంపై భారత్ ఆందోళన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) యుద్ధంలో భాగంగా గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భాగంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvatheneni harish) ఈ విషయాన్ని లేవనెత్తారు. గాజా ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడానికి శాశ్వత కాల్పుల విరమణ అవసరమని నొక్కి చెప్పారు. ‘గాజాలో తీవ్రమైన ఇంధనం, ఆహార కొరత నెలకొంది. వైద్య సేవలు, విద్య అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మానవతా సవాళ్ల స్థాయిని పరిష్కరించడానికి శత్రుత్వాల్లో అడపాదడపా విరామాలు సరిపోవు’ అని వ్యాఖ్యానించారు. సురక్షితంగా మానవతా సాయం అందింంచాల్సి ఉందన్నారు. వెంటనే కాల్పుల విరమణ అమలులోకి తీసుకురావాలని, బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. దౌత్య మార్గం మాత్రమే పరిష్కారాన్ని ఇవ్వగలదని నొక్కి చెప్పారు.






