- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రొయేషియాలో గాయత్రి మంత్రం.. మోదీ పర్యటనలో అరుదైన సంఘటన
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మూడు దేశాల పర్యటనలో భాగంగా క్రొయేషియా చేరుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మూడు దేశాల పర్యటనలో భాగంగా క్రొయేషియా చేరుకున్నారు. రాజధాని జగ్రేబ్ నగరంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ మోదీకి సాంస్కృతిక ఆతిథ్యాన్ని ఇచ్చారు. భారతీయ సంస్కృతి పట్ల విదేశీయుల గౌరవం చూసిన మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'సంస్కృతికి ఉన్న బంధాలు బలమైనవి! జాగ్రెబ్‌లో స్వాగతంలో ఇది ఒక భాగం మాత్రమే. క్రొయేషియాలో భారతీయ సంస్కృతి పట్ల ఉన్న గౌరవం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు. ఈ ఘట్టం ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే దిశగా ఒక సానుకూల సంకేతంగా భావించబడుతోంది. ఇది మోదీ పర్యటనలో హైలైట్‌గా నిలిచింది.
Next Story






