Gavai: బాలికల రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలి.. సీజేఐ బీఆర్ గవాయ్

by B.Srinivas |

డిజిటల్ యుగంలో బాలికలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. వారి భద్రతకు ఆందోళనకరంగా మారాయని తెలిపారు.

Gavai: బాలికల రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలి..  సీజేఐ బీఆర్ గవాయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ యుగంలో బాలికలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని సీజేఐ బీఆర్ గవాయ్ (Gavai) అన్నారు. ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ వార్నింగ్స్, డిజిటల్ స్టాకింగ్, డీప్‌ఫేక్ ఇమేజెస్‌లు వారి భద్రతకు ఆందోళనకరంగా మారాయని తెలిపారు. వీటి నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, అటువంటి కేసులను నిర్వహించేవారిని స్పెషల్ ట్రెయినింగ్ ఇవ్వాలని చెప్పారు. ’సేఫ్‌గార్డింగ్ ది గర్ల్ చైల్డ్’ అనే అంశంపై శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగ హామీలు ఉన్నప్పటికీ, భారతదేశంలో చాలా మంది బాలికలకు ఇప్పటికీ ప్రాథమిక హక్కులు, గౌరవం నిరాకరించబడిందని నొక్కి చెప్పారు. గౌరవం తిరస్కరణకు గురైన చోట భద్రత ఉండబోదన్నారు. ఒక దేశ బలం ఆ దేశ బాలికల శ్రేయస్సు, సాధికరతతో ముడిపడి ఉన్నాయన్నారు.

విద్య, సమానత్వం ద్వారానే ఆకాంక్షలతో కూడిన సమాజం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. సమాజానికి అవరోధంగా ఉన్న పితృస్వామ్య సమాజాన్ని అధిగమించాన్నారు. బాలికల జీవితాలకు ఆటంకం కలిగించే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అడ్డంకులను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్’ అనే కవితను గుర్తు చేస్తూ దేశంలోని ఏ అమ్మాయి అయినా హింస, వివక్ష లేదా అవకాశాల తిరస్కరణకు గురవుతున్నంత కాలం భారత్ నిజమైన స్వేచ్ఛను చేరుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story