Gavai: రిటైర్డ్ న్యాయమూర్తులు ఆ పదవులు చేపట్టొద్దు.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్తే అనుమానాలు తలెత్తుతాయని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు.

Gavai: రిటైర్డ్ న్యాయమూర్తులు ఆ పదవులు చేపట్టొద్దు.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్తే ప్రజల్లో అనుమానాలు తలెత్తుతాయని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (BR gavai) అన్నారు. ఒక న్యాయమూర్తి రిటైర్మెంట్ అయిన వెంటనే ప్రభుత్వంలో ఏదైనా పదవి చేపట్టినా, ఎన్నికల్లో పోటీ చేయడానికి బెంచ్ నుంచి రిజైన్ చేసిన అది నైతిక ఆందోళనలను లేవనెత్తుతుందన్నారు. న్యాయవ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తనలు ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. యూకే సుప్రీంకోర్టు (Uk supreme court) లో తాజాగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. జ్యుడీషియరీలో అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చినప్పుడల్లా, సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను గవాయ్ సమర్థించారు. 1993 వరకు సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయ నియామకాల్లో కార్యనిర్వాహక వర్గం నిర్ణయాత్మక అధికారాన్ని కలిగి ఉందన్నారు. ‘కొలీజియం వ్యవస్థపై విమర్శలు ఉండొచ్చు. కానీ ఏదైనా పరిష్కారం న్యాయ స్వాతంత్ర్యాన్ని పణంగా పెట్టకూడదు. న్యాయమూర్తులు బాహ్య ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి’ అని తెలిపారు. న్యాయవ్యవస్థ కేవలం న్యాయం అందించడమే కాకుండా అధికారాన్ని జవాబుదారీగా ఉంచగల విశ్వసనీయ సంస్థగా భావించాలని నొక్కి చెప్పారు.

Next Story