Gavai: న్యాయవ్యవస్థలో ఏఐ.. జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర ఆందోళన

by B.Srinivas |

కోర్టు తీర్పులను అంచనా వేయడానికి ఏఐని ఒక సాధనంగా ఉపయోగించడానికి చేస్తున్న ప్రయత్నాలపై బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Gavai: న్యాయవ్యవస్థలో ఏఐ.. జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: కోర్టు తీర్పులను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఒక సాధనంగా ఉపయోగించడానికి చేస్తున్న ప్రయత్నాలపై సుప్రీంకోర్టు (Supreme court) న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Br gavai) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవ భావోద్వేగాలు, నైతిక తార్కికత లేని యంత్రం చట్టపరమైన వివాదాల సంక్లిష్టతలను, సూక్ష్మ నైపుణ్యాలను నిజంగా గ్రహించగలదా అని ప్రశ్నించారు. కెన్యా సుప్రీంకోర్టు (Kenya supreme court) లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ‘లేవరేజింగ్ టెక్నాలజీ విత్ జ్యుడీషియరీ’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. న్యాయవ్యవస్థలో ఏఐ అనుసంధానించడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. న్యాయం అంతిమ సారాంశం నైతిక పరిశీలనలు, ఎమోషన్స్, సందర్భోచిత అవగాహనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కోర్టులు తమ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని గుర్తు చేశారు.

కానీ చాట్ జీపీటీ వంటి ప్లాట్‌ఫారమ్‌, ఏఐపై ఆధారపడటం వల్ల పలు ఇబ్బందికరమైన పరిణామాలు సైతం ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘ఏఐ అధికంగా చట్టపరమైప డేటాను ప్రాసెస్ చేయగలదు. కానీ మానవ స్థాయి ఆలోచనలవలె మూలాలను ధ్రువీకరించే సామర్థ్యం దీనికి లేదు. దీనివల్ల న్యాయవాదులు, పరిశోధకులు, ఏఐ వెల్లడించిన సమాచారాన్ని విశ్వసిస్తే వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి’ అని తెలిపారు. భారతీయ కోర్టులు సాంకేతికతను స్వీకరించినప్పటికీ కంటెంట్ సృష్టికర్తలు, యూట్యూబర్లు కోర్టు కార్యకలాపాలను సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మార్చడానికి సవరించిన క్లిప్‌లను అప్‌లోడ్ చేయడంతో న్యాయవ్యవస్థ సమస్యను ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. ఈ క్లిప్‌లలోని తప్పుడు సమాచారం, న్యాయపరమైన చర్చలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు.

Next Story