- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaurav Gogoi: వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి నరేంద్ర మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా "రాజ్యాంగాన్ని మార్చేందుకు" ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి నరేంద్ర మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా "రాజ్యాంగాన్ని మార్చేందుకు" ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై 4డీ(డైల్యూట్, డిఫేమ్, డివైడ్, డిస్ ఎన్ ఫ్రాంఛైజ్) అంశాలను ప్రస్తావిస్తూ దాడి చేశారు. అ కిరణ్ రిజిజు మాట్లాడుతూ.."ఈ బిల్లు వల్ల రాజ్యాంగాన్ని మార్చడం, మైనారిటీ వర్గాలను కించపరచడం, భారతీయ సమాజాన్ని విభజించడం, మైనారిటీల హక్కులను కాలరాజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది" అని కాంగ్రెస్ నేత చెప్పుకొచ్చారు. లోక్‌సభలో మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై విమర్శలు గుప్పించారు. అన్ని పార్టీల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని జేపీసీ చర్చ జరిగిందన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వాదనలను తోసిపుచ్చారు. క్లాజుల వారీగా చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు సూచించిన ఒక్క సవరణ కూడా జరగలేదని గొగొయ్ అన్నారు. వక్ఫ్ గురించి తెలియని వారిని జేపీసీకి ఆహ్వానించలేదని చెప్పారు.
కేంద్రంపై విమర్శలు
ప్రభుత్వం ప్రస్తుతం ఒక వర్గానికి చెందిన వారిని భూమిని లక్ష్యంగా చేసుకుందని గొగొయి అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇతర మైనారిటీల భూమిని లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. అంతకుముందు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1)లో పేర్కొన్న విధంగా మోడీ ప్రభుత్వం ఎవరి "మతాన్ని ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే" స్వేచ్ఛను అడ్డుకోవడం లేదని అన్నారు. "ఇది వక్ఫ్ నిర్వహణకు సంబంధించినది. దీనికి ఇతరుల మతాల్లో జోక్యం చేసుకోవడానికి సంబంధం లేదు" అని రిజిజు స్పష్టం చేశారు. అయితే, రిజిజు వాదనలను గొగొయి తోసిపుచ్చారు. ఒక వ్యక్తి కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరిస్తేనే ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించగల సవరణను ఎత్తి చూపుతూ గొగొయి ఎత్తిచూపారు. "మీరు ఇతర మతాల నుండి సర్టిఫికేట్ అడుగుతారా? ఈ బిల్లులో దీన్ని ఎందుకు అడుగుతున్నారు? ప్రభుత్వం ఈ మతం విషయంలోనే ఎందుకు జోక్యం చేసుకుంటోంది." అని ప్రశ్నించారు. ఒక చట్టంలో సవరణలు.. ఆ బిల్లును బలోపేతం చేయడానికి లక్ష్యంగా ఉండాలే కానీ.. మరిన్ని వివాదాలను సృష్టించకూడదు" అని గొగొయి అన్నారు.






