Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీపై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ(Himanta Sarma) మ‌రోసారి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయిపై సంచలన ఆరోపణలు చేశారు.ఆయన భార్య ఎలిజ‌బెత్ కోల్‌బ‌ర్న్‌కు పాకిస్థాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్న‌ట్లు ఆరోపించారు.

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీపై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ(Himanta Sarma) మ‌రోసారి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయిపై సంచలన ఆరోపణలు చేశారు.ఆయన భార్య ఎలిజ‌బెత్ కోల్‌బ‌ర్న్‌కు పాకిస్థాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్న‌ట్లు ఆరోపించారు. పాకిస్థాన్‌కు భార‌త్ నుంచి కోల్‌బ‌ర్న్ 19 సార్లు ప్ర‌యాణం చేసిన‌ట్లు పేర్కొన్నారు. పాక్‌లో సంచ‌రిస్తున్న స‌మ‌యంలో ఆ దేశ ఆర్మీ ఆమెకు స‌హ‌క‌రించిన‌ట్లు చెప్పారు. పాకిస్థాన్‌లో కోల్‌బ‌ర్న్ ప‌నిచేశార‌ని.. ఆ త‌ర్వాత ఆమె ఢిల్లీలోని ఎన్జీవోలో చేసిన‌ట్లు చెప్పారు. కానీ, ఇస్లామాబ్ద నుంచే ఆమె జీతభత్యాలు అందుకున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా, ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లినట్లు బిశ్వ‌శ‌ర్మ తెలిపారు. వారం రోజుల్లో ఆయ‌న భార్య భారత్ తిరిగివచ్చారని.. కానీ గొగొయి మాత్రం కొన్నిరోజులపాటు అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇస్లామాబాద్ లో 15 రోజుల పాటు గొగొయి ఏం చేశారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. పాకిస్థాన్‌లో అత‌నేం చేశారో చెప్పాల‌ని.. వాళ్ల ఆర్మీకి ఎలా స‌హ‌క‌రించారో వెల్ల‌డించాల‌న్నారు. ఒక‌వేళ అధికార హోదాలో గొగొయి పాక్ కు వెళ్తే పాకిస్థాన్‌కు వెళ్తే దాన్ని ప్ర‌శ్నించే వాళ్లం కాదని.. కానీ వ్యక్తిగత పని మీద ఆయన వెళ్లారని ఆరోపించారు. అయితే, అక్క‌డ ఎవ‌రితో ఆయ‌న ఉన్నారో తెలపాలని డిమాండ్ చేశారు.

Next Story