- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaurav Gogoi: కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ భార్యకు ఐఎస్ఐతో లింకులు.. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపణ
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌కు పాకిస్తాన్, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) భార్య ఎలిజబెత్ కోల్బర్న్ (Elizabeth Colburn)కు పాకిస్తాన్, తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (Gaurav bhatiya) ఆరోపించారు. కోల్బర్న్ పనిచేస్తున్న సంస్థకు జార్జ్ సోరోస్ నిధులు సమకూరుస్తున్నారని తెలిపారు. అంతేగాక పాక్ ప్లానింగ్ కమిషన్ సలహాదారు అలీ తౌకీర్ షేక్‌తో ఆమె కలిసి పనిచేశారన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని కాబట్టి దీనిపై లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, గౌరవ్ గొగోయ్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొగోయ్ భార్య విదేశీ పౌరురాలు అయినప్పటికీ, ఆమె పనిచేసే సంస్థకు జార్జ్ సోరోస్ నిధులు సమకూరుస్తున్నారన్నారు. అలాగే అసోం సీఎం హిమంత బిస్వ శర్మ సైతం ఈ ఆరోపణలపై స్పందించారు. దీనిపై ప్రభుత్వ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఆరోపణలపై గౌరవ్ గొగోయ్ స్పందించారు. బీజేపీ నేత వ్యాఖ్యలు హస్యాస్పదంగా ఉన్నాయని అభివర్ణించారు. లేవనెత్తడానికి ఎటువంటి సమస్యలు లేనందున తనపై ఇటువంటి నిరాధారమైన ఆరోపణలను మోపడానికి ప్రయత్నిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, కానీ బీజేపీ అస్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.






