- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel: హమాస్ ఆయుధాలు వదలకపోతే గాజా సిటీ ధ్వంసం
యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించకపోతే గాజా నగరాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ ఆయుధాలు వీడాలని, బందీలందరినీ విడుదల చేసి, ఇజ్రాయెల్ నిబంధనల ప్రకారం యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించకపోతే గాజా నగరాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హమాస్ తమ దారికి రాకపోతే విధ్వంసం తప్పదు, వారికి నరకానికి దారులు తెరుచుకున్నట్టేనని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. త్వరలో గాజాలోని హమాస్ హంతకులు, అత్యాచారం చేసిన వారికి నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి. వారు యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్ షరతులకు అంగీకరించే వరకు, బందీలందరినీ విడుదల చేయాలని, ఆయుధాలను వదలాలని స్పష్టం చేశారు. దీనికి అంగీకరించకపోతే గాజా సిటీ మరో రఫా, బీట్ హనౌన్‌గా మారక తప్పదని హెచ్చరించారు. ఇటీవల గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆమోదించారు. దీనికోసం రెండు ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా, యుద్ధాన్ని ముగిసి, బందీలను విడుదల చేయడానికి చర్చలు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశ రక్షణమంత్రి తాజా హెచ్చరికలు చేశారు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 60,000 మంది రిజర్విస్టులను పిలవడానికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మిడిల్ ఈస్ట్‌లో కరువు
మరోవైపు, గాజాలో కరువు తాండవిస్తోంది. వచ్చే నెలలో పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని శుక్రవారం ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. ఈ అంచనాల తర్వాతైనా యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనాకు మరింత మానవతా సహాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచుతుందని భావిస్తున్నారు. కరువు కారణంగా 5 లక్షల మది ప్రజలు ఆకలితో క్షీణిస్తున్నారని, ఇది మిడిల్-ఈస్ట్ ప్రాంతంలోనే తొలి కరువు అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. గాజాలోని దాదాపు పావు వంతు అంటే 5,14,000 మంది పాలస్తీనియన్లు కరువును ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి ఇది 6,41,000 కు పెరుగుతుందని అంచనా. అయితే, ఈ నివేదికను ఇజ్రాయెల్ ఖండించింది. ఇది స్వార్థ ప్రయోజనాలతో రూపొందించిన నివేదిక అని స్పష్టం చేసింది.






