- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిలిండర్ల కొరత.. బిల్లులో గ్యాస్ చార్జీల వసూలు.. చెన్నై హోటల్ బిల్లు వైరల్
గ్యాస్ కొరత నేపథ్యంలో చెన్నైలోని ఒక హోటల్ కస్టమర్ బిల్లులో అదనంగా గ్యాస్ ఛార్జీని వసూలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో గ్యాస్ కొరతతోప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఎఫెక్టుతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడగా మరికొన్ని మెనూను తగ్గించి నడిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చెన్నైలోని 'గీరాస్ రెస్టారెంట్' (Geeraas Restaurant) లో టిఫిన్ చేసిన ఒక కస్టమర్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇడ్లీ, వడ ఆర్డర్ చేయగా.. హోటల్ యాజమాన్యం బిల్లులో టిఫిన్ ధరతో పాటు ప్రత్యేకంగా "Gas" (గ్యాస్) ఛార్జీని కూడా వసూలు చేసింది. ఇడ్లీ: 33.33 రూపాయలు, వడ: 33.33 రూపాయలతో పాటు గ్యాస్ ఛార్జీ (Gas Charge): 9.52 రూపాయలు, మొత్తం (GSTతో కలిపి) 80 రూపాయల బిల్లును కస్టమర్ చేతిలో పెట్టింది. ఇందుకు సంబంధించిన బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.






