- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ganga River: బిహార్‌లోని గంగా జలాల్లో బ్యాక్టీరియా.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు
బిహార్‌లోని గంగా నది నీరు చాలా చోట్ల స్నానానికి పనికొచ్చేలా లేదని, ఎందుకంటే అందులో అధిక మోతాదులో బ్యాక్టిరియా ఉందని 2024-25 ఆర్థిక సర్వేలో వెల్లడైంది.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని గంగా నది నీరు (Ganga River water) చాలా చోట్ల స్నానానికి పనికొచ్చేలా లేదని, ఎందుకంటే అందులో అధిక మోతాదులో బ్యాక్టిరియా ఉందని 2024-25 ఆర్థిక సర్వే (Economic survey)లో వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఈ సర్వే ప్రకారం.. గంగా జలాల్లో మలి కొలిఫాం బ్యాక్టీరియా పరిమితుల కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. గంగా, దాని ఉపనదుల ఒడ్డున ఉన్న నగరాల నుంచి మురుగునీరు, వ్యర్థ జలాల విడుదల కారణంగా బ్యాక్టీరియా పెరుగుతోందని తెలిపింది. అలాగే నీటి ఆమ్లత్వం, క్షారత్వం విలువ, బయో-కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ గంగా నదితో పాటు ఉప నదుల్లో నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
బిహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (BSPCB) రాష్ట్రంలోని 34 ప్రదేశాల్లో గంగా నది నీటి నాణ్యతను ప్రతి పక్షం రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నివేదికపై బీఎస్‌పీసీబీ చైర్మన్ డీకే శుక్లా (DK Shukla) స్పందిస్తూ.. గంగా నదిలో బాక్టీరియా అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. గంగానదిలో చాలా చోట్ల మొత్తం కోలిఫాం, మలి కోలిఫాం ఉనికి ఎక్కువగా ఉందని కాబట్టి ఈ నీరు స్నానం చేయడానికి ఉపయోగించలేమని తెలిపారు. రాష్ట్రంలోని మురుగునీటి శుద్ధి కర్మాగారాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఇటీవల ప్రయాగ్ రాజ్ నగరంలో ముగిసిన మహాకుంభమేళా సందర్భంగా కూడా త్రివేణి సంగమంలో మలికొలిఫాం బ్యా్క్టీరియా అధికంగా ఉన్నట్టు పలు కథనాలు వెల్లడించిన విషయం తెలిసిందే.






