- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో దారుణం.. స్నేహం నటించి.. మహిళపై సామూహిక లైంగికదాడి
రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దేశంలో రోజురోజుకు మహిళలపై లైంగిక దాడుల(Sexual assault) ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నాయి. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru)లోని కోరమంగళ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. నిన్న(శుక్రవారం) స్నేహితురాలిని నమ్మించి హోటల్‌కు రప్పించారు. ఈ క్రమంలో హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు ఆమె పై సామూహిక లైంగికదాడికి(Sexual assault) పాల్పడ్డారు. అనంతరం ఆ నిందితులు ఘటన స్థలం నుంచి పరారయ్యారు.
నిందితుల్లో ఒకరు ఆమెకు పరిచయస్తుడే కావడం గమనార్హం. ఈ క్రమంలో బాధితురాలు ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పశ్చిమ బెంగాల్(West Bengal), ఉత్తరాఖండ్(Uttarkhand)కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన పై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు HSR లే అవుట్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన బాధితురాలు పెళ్లి చేసుకుని నగరంలోనే ఉంటుంది. స్నేహితుడిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నిందితులు ఆమెను నమ్మించి హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దోచుకుని పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె స్నేహితుడే ఆమెను హోటల్‌కు రప్పించినట్లు సమాచారం.






