- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ అరెస్ట్ మోసం.. వృద్ధురాలి వద్ద రూ. 49 లక్షలు దోచుకున్న గ్యాంగ్, లక్నోలో ఆరుగురు అరెస్ట్
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్దతుల్లో అమయాకులను మోసం చేసి వారి ఖాతాలో నగదుని దోచేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్దతుల్లో అమయాకులను మోసం చేసి వారి ఖాతాలో నగదుని దోచేస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎక్కవగా అవుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై దృష్టి పెట్టినప్పటికీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ మరో పెద్ద మోసపూరిత గ్యాంగ్‌ని పట్టుబట్టి వెలుగులోకి తెచ్చింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన ఈ సంచలన కేసులో, 71 ఏళ్ల వృద్ధురాలిని నకిలీ కోర్టు ఉత్తర్వులతో భయపెట్టిన దుండగులు, ఆమె పిల్లలను అరెస్ట్ చేస్తామని బెదిరించి ఏకంగా రూ.49 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాలకు బలవంతంగా ట్రాన్స్‌ఫర్ చేయించారు.
ఈ కేసు వివరాలను ఢిల్లీలో ఆదివారం క్రైమ్ బ్రాంచ్ డీసీపీ ఆదిత్య గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగాళ్లు వృద్ధురాలి వ్యక్తిగత వివరాలు అనేక మోసాల్లో వాడబడ్డాయని అబద్ధం చెప్పి, నకిలీ కోర్టు డాక్యుమెంట్లతో ఆమెను తీవ్రంగా భయపెట్టారు. ఈ క్రమంలోనే దర్యాప్తు వేగంగా చేసి, లక్నో నుంచి ఆరు మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. అదే విధంగా, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర సభ్యులపై కూడా ముఖ్యమైన సమాచారాన్ని పోలీసులు పొందారని, త్వరలో మరిన్ని అరెస్టులు ఉండనున్నాయని డీసీపీ ఆదిత్య గౌతమ్ వెల్లడించారు. ట్వీట్ ఇదే..






