భర్తను చెట్టుకు కట్టేసి.. ఆయన కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-24 09:24:43  IST  )

దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా పెళ్లి అయిందని భర్తతో గుడికి వెళ్తే.. ఆ ఆనందం కాస్త విషాదానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణమైన సంఘటన జరిగింది. గుర్హ్ ప్రాంతంలోని భైరవ్ బాబా ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

భర్తను చెట్టుకు కట్టేసి.. ఆయన కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా పెళ్లి అయిందని భర్తతో గుడికి వెళ్తే.. ఆ ఆనందం కాస్త విషాదానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణమైన సంఘటన జరిగింది. గుర్హ్ ప్రాంతంలోని భైరవ్ బాబా ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా వివాహమైన 19 ఏళ్ల మహిళ.. తన భర్తతో కలిసి గుడికి వెళ్లింది. అయితే మద్యం మత్తులో ఉన్న ఐదుగురు దుండగులు ఈ దంపతులపై దాడి చేశారు. భర్తను చెట్టుకు కట్టివేసి.. మహిళపై అత్యాచారం చేశారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి.. ఫిర్యాదు చేస్తే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని బెదిరించారు. కానీ బాధితులు మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. సెక్షన్ 70 కింద కేసు నమోదు చేశారు. కాగా స్థానికంగా ఈ కేసు రాజకీయంగా దుమారం రేపింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణగా వర్ణిస్తున్నాయి ప్రతిపక్షాలు.

Next Story