- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. పిల్లను తీసుకొస్తున్నానని ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసిన లవర్..
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది. స్కూల్‌కు వెళ్లే దళిత అమ్మాయి.. లవర్‌ను నమ్మి బయటకు పోతే బాధితురాలిగా మిగిపోయింది. ఊరు బయటకు వెళ్దామని.. కాసేపు ఆనందంగా గడుపుదామని అడిగాడు ప్రియుడు. దీంతో కాదనలేక అతనితో వెళ్లింది.

దిశ, వెబ్ డెస్క్: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది. స్కూల్‌కు వెళ్లే దళిత అమ్మాయి.. లవర్‌ను నమ్మి బయటకు పోతే బాధితురాలిగా మిగిపోయింది. ఊరు బయటకు వెళ్దామని.. కాసేపు ఆనందంగా గడుపుదామని అడిగాడు ప్రియుడు. దీంతో కాదనలేక అతనితో వెళ్లింది. అయితే తను ఒప్పుకోవడంతో.. వెంటనే తన ఫ్రెండ్స్‌కు కాల్ చేశాడు లవర్. ఒక అమ్మాయిని తీసుకొస్తున్నానని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ముందుగా అమ్మాయిని సెక్సువల్‌గా వాడుకున్న అతను.. ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చాక కామ్ అయిపోయాడు. ‘నీ పేరు ఏంటి? నీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ ఏం చేస్తున్నావ్? నీ తండ్రి పేరేంటి? చదువుకునే వయసులో ఇవేం పనులు’ అంటూ ప్రశ్నలు సంధించడంతో అమ్మాయి బెదిరిపోయింది. దీంతో తమతో పడుకోవాలని లేదంటే విషయాన్ని బయటకు చెప్తామని బెదిరించారు. బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నారు నెటిజన్లు.






