ఓయో రూమ్‌లో గ్యాంగ్ రేప్.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లోని అక్రమంగా నడుస్తున్న మూన్‌లైట్ OYO హోటల్‌లో దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వర్గానికి చెందిన బాలికలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిడి జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవర్గానికి చెందిన యువకులు ఈ బాలికలను ఇక్కడకు తీసుకొచ్చి..

ఓయో రూమ్‌లో గ్యాంగ్ రేప్.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లోని అక్రమంగా నడుస్తున్న మూన్‌లైట్ OYO హోటల్‌లో దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వర్గానికి చెందిన బాలికలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిడి జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవర్గానికి చెందిన యువకులు ఈ బాలికలను ఇక్కడకు తీసుకొచ్చి.. గ్యాంగ్ రేప్ చేస్తున్నారని, ఎమోషనల్‌గా బాండ్ పెరిగాక కన్వర్జేషన్ ఒత్తిళ్లు పెంచుతారని ఆరోపిస్తున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇందుకు సపోర్ట్ చేసే హోటల్ యజమానులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఒక ఉద్యోగిపై మాత్రమే కేసు నమోదు చేసి.. ఈ విషయాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.

దయచేసి ఇలాంటి మతమార్పిడి విషయంపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఓయో రూమ్స్‌ను మూసి వేయాలని.. కపుల్స్‌ను అనుమతించకుండా ఉండాలని అంటున్నారు.

VIDEO

Next Story