కోయంబత్తూర్‌లో దారుణం.. లవర్ తో బయటికి వెళ్లిన స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్

by Muthe.Rajitha |

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

కోయంబత్తూర్‌లో దారుణం.. లవర్ తో బయటికి వెళ్లిన స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని కోయంబత్తూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడితో కారులో వెళ్ళిన ఓ పీజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆదివారం సాయంత్రం తన లవర్ తో సరదా కారులో లాంగ్ డ్రైవ్ కి ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి, అక్కడ ఒకచోట కారులోనే మాట్లాడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. కారులో నుంచి ఇద్దరినీ బయటికి లాగి, యువకుడిని తీవ్రంగా కొట్టి, యువతిని దూరంగా ఈడ్చుకుపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు.

అయితె అదంతా నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. తెల్లవారు జామున అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. బాధితుల్ని ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నట్టు ఉన్నతాధికారులు పేర్కున్నారు.

Next Story