2 వేల కోట్ల ఆస్తులు కొట్టేయడానికి ప్లాన్.. గాంధీ కుటుంబపై ఈడీ సంచలన ఆరోపణలు!

by Phanindra |   (  Updated:2025-07-02 15:17:05  IST  )

2 వేల కోట్ల ఆస్తులు కొట్టేయడానికి గాంధీ కుటుంబం ప్లాన్ చేసిందని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.

2 వేల కోట్ల ఆస్తులు కొట్టేయడానికి ప్లాన్.. గాంధీ కుటుంబపై ఈడీ సంచలన ఆరోపణలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి గాంధీ కుటుంబం ప్రయత్నించిందని ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) నష్టాల్లో ఉందని, కానీ ఈ కంపెనీ వద్ద సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని, ఇలాంటి సమయంలో రోజువారీ ఖర్చుల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి రూ.90 కోట్లు అప్పుగా తీసుకుందని ఈడీ తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.

ఈ క్రమంలోనే యంగ్ ఇండియన్ అనే కంపెనీని ఏర్పాటు చేసి, దీని ద్వారా ఏజేఎల్‌ ఆస్తులను కాజేయాలనే కుట్రపన్నారని ఢిల్లీ కోర్టుకు ఎస్వీ రాజు తెలియజేశారు. అయితే ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో 76 శాతం షేర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరిటే ఉన్నాయని ఆయన వివరించారు. ‘యంగ్ ఇండియా కంపెనీ ద్వారా రూ.90 కోట్ల అప్పుతో రూ.2 వేల కోట్ల ఆస్తులు కాజేయడానికి కుట్ర జరిగింది.

ఈ కంపెనీని తాము టేకోవర్ చేయాలని సోనియా, రాహుల్ అనుకున్నారు’ అని ఎస్వీ రాజు వివరించారు. అలాగే దర్యాప్తులో మరిన్ని ఆధారాలు దొరికితే కాంగ్రెస్ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేరుస్తామని స్పష్టంచేశారు. కాగా, ఇంతకుముందు ఈ కేసులో గాంధీ కుటుంబం రూ.142 కోట్ల లబ్ధి పొందినట్లు ఈడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story