- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ కుటుంబం నాకు దేవుడితో సమానం: డీకే శివకుమార్
గాంధీ కుటుంబం నాకు దేవుడితో సమానం, చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని డీకే శివకుమార్ తేల్చిచెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వ్యక్తినని, ఆ పార్టీలోనే మరణిస్తానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇటీవల కర్ణాటక అంసెబ్లీలో ప్రతిపక్ష బీజేపీని విమర్శించే క్రమంలో ఆయన ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెస్ వీడనున్నారని, బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా డీకేపై విమర్శలు గుప్పించారు.
వీటిపై స్పందించిన ఆయన.. తాను కేవలం ప్రతిపక్ష నేత ఆర్. అశోకను విమర్శించేందుకే ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించానని చెప్పారు. ‘నేను వాళ్లను పొగిడేందుకు ప్రయత్నించలేదు. విమర్శించేందుకే ఆ ప్రార్థనలోని మూడు వాక్యాలు పాడాను’ అన్నారు. తన రాజకీయ భక్తి గాంధీ కుటుంబానికే అని, గాంధీ కుటుంబం తనకు దేవుడితో సమానమని స్పష్టంచేశారు. అదే సమయంలో కొందరు సొంత పార్టీ నేతలు తనపై చేసిన కామెంట్స్ తనకు నచ్చలేదన్నారు.






