సక్సెస్ పరేడ్‌లు ఎందుకు.. ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయను: తొక్కిసలాట ఘటనపై గంభీర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) స్పందించారు.

సక్సెస్ పరేడ్‌లు ఎందుకు.. ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయను: తొక్కిసలాట ఘటనపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) స్పందించారు. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌తో కలిసి ఇవాళ గంభీర్ మీడియా ముందుకు వచ్చారు. రోడ్ షోలు, విక్టరీ పరేడ్‌లు అవసరం లేదని అన్నారు. ఇలాంటివి తాను అస్సలు ఎంకరేజ్ చేయను అని చెప్పారు. 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా ఇదే చెప్పాను అని గుర్తుచేశారు. చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం. దీనికి ఏ ఒక్కరో కాకుండా అందరం బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇవాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా జాగ్రత్త పడాలి. ఒక ప్రాణం పోవడం అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడటం అని అన్నారు. మృతుల కుటుంబాల గురించి ఆలోచించాలి.. మరోసారి పరేడ్‌లు అనే ఆలోచన ఎవరికీ రాకూడదు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. స్వయంగా బాధితులను పరామర్శించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోడీ కూడా స్పందిచి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

Next Story