"గజరాజా"... నీ అందానికి ప్రపంచమే ఫిదా...!

by Geesa Chandu |

పేరు సెంగమలం. ఈ పేరు వినగానే మనిషి అనుకునేరు.! కానీ అదొక ఏనుగు. తమిళనాడుకు చెందిన ఈ ఏనుగు తన డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

గజరాజా... నీ అందానికి ప్రపంచమే ఫిదా...!
X

దిశ, వెబ్ డెస్క్: పేరు సెంగమలం. ఈ పేరు వినగానే మనిషి అనుకునేరు.! కానీ అదొక ఏనుగు. తమిళనాడుకు చెందిన ఈ ఏనుగు తన డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. "బాబ్- కట్ సెంగమలం" అని పిలిచే ఈ ఏనుగు ప్రపంచంలోని అత్యంత అందమైన ఏనుగులలో ఒకటిగా గుర్తింపు సంపాదించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే దీన్నిమొదటిసారిగా 2003 లో కేరళ నుంచి తమిళనాడులో ఉన్నటువంటి రాజగోపాల స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. మౌట ఎస్ రాజగోపాల్ అనే వ్యక్తి ఈ ఏనుగు యొక్క హెయిర్ స్టైల్ ను చూసుకుంటున్నారు. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ వల్లనే దీనికి ఇంత అందం వచ్చింది., ఇది అన్నిటికంటే ప్రత్యేకంగా కనిపించటానికే దీనికి ఈ హెయిర్ స్టైల్ చేయించినట్లు, అలాగే ఈ హెయిర్ స్టైల్ కు తగిన మెయింటె నెన్స్, కేర్ కూడా అవసరమని దీని యజమాని చెప్పుకొచ్చాడు.

Next Story