- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉగ్రరూపం దాల్చిన గజరాజు.. పెంచి పోషించిన మావటి తొక్కి చంపిన వైనం

దిశ, వెబ్ డెస్క్: తనను పెంచి, పోషించిన మావటి వాడినే ఏనుగు తొక్కి చంపేసిన ఘటన కేరళ(Kerala)లో జరిగింది. దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతున్నారు. పాలక్కడ్ (Palakkad)లోని కుట్టనాడ్ (Kuttanad) ప్రాంతలోని ఓ ఆలయంలో వార్షికోత్సవ (Anniversary Programe) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఆలయ నిర్వహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో భాగంగా గజ సంగమం (Gaja Sangamam) కోసం వల్లంకుళం నారాయన్ కుట్టి (Vallakulam Narayan Kutti) అనే ఏనుగు (Elephant)ను ఏర్పాటు చేశారు.
సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఈ కార్యక్రమం అయిపోయి తిరిగి వస్తుండగా.. తన్నీర్ కోడ్ (Thenner Kode Road) రోడ్డులో ఏనుగు ఒక్కసారిగా ఉగ్రరూపం (Angry) దాల్చింది. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ.. రోడ్డు పై వెళుతున్న ప్రజలపై దాడి (Attack) చేయడం ప్రారంభించింది. ఏనుగును నియంత్రించబోయిన మావటి వాడిని నడి రోడ్డుపై పడేసి కాలితో తొక్కింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు (People) పరుగులు తీశారు. అనంతరం ఆలయం చుట్టూ నిర్మించిన దుకాణాలపై దాడి చేసింది. అంతేగాక ఆలయ పరిధిలో పార్క్ (Park) చేసిన వాహనాలను (Vehicles) ధ్వంసం (Crash) చేసింది.
ఏనుగును నియంత్రించేందుకు ఎంతమంది ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. దాదాపు గంట సమయం తర్వాత ఏనుగు శాంతించింది. ఈ దాడిలో గాయపడిన మావటి కుంజుమోన్ (Kunjumoan) ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లోనే మావటి ప్రాణాలు (Died) కోల్పోయాడు. అంతేగాక ఏనుగు దాడిలో మరో వ్యక్తి తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రితో చికిత్స పొందుతున్నాడు. ఏనుగు అలా ఎందుకు ప్రవర్తించిందో సమాచారం తెలియరాలేదు. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారాయి.