Gadkari: ప్రజలను మూర్ఖులను చేసేవారే బెస్ట్ లీడర్ అవుతారు.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

by B.Srinivas |   (  Updated:2025-09-01 17:58:41  IST  )

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను బాగా మోసం చేయగలిగిన వారే ఉత్తమ నాయకుడు కాగలడని అన్నారు.

Gadkari: ప్రజలను మూర్ఖులను చేసేవారే బెస్ట్ లీడర్ అవుతారు.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉత్సాహంతో పనిచేసే వ్యక్తులు ఉంటారని, కానీ ప్రజలను బాగా మోసం చేయగలిగిన వారే ఉత్తమ నాయకుడు కాగలడని అన్నారు. నాగ్ పూర్‌లో అఖిల భారతీయ మహానుభావ్ పరిషత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు షార్ట్ కట్స్ ఎంచుకోకుండా నిజాయితీ, అంకిత భావంతో పని చేయాలని కోరారు. షార్ట్ కట్స్ సత్వర ఫలితాలను అందించొచ్చు కానీ దీర్ఘకాలిక విశ్వసనీయతను బలహీనపరుస్తాయని చెప్పారు. సమాజంలో నిజాయితీ, క్రెడిబిలిటీ, డెడికేషన్ ఎంతో ముఖ్యమన్నారు. జీవితంలో సత్యాన్ని అనుసరించాలని దీర్ఘకాలిక విజయం సత్యానికే చెందుతుందని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నిజమే ఎల్లప్పుడూ గెలుస్తుందని తెలిపారు. మహానుభావ శాఖ స్థాపకుడు చక్రధర్ స్వామి బోధనలు ప్రతి ఒక్కరి జీవితానికి ప్రేరణనిస్తాయని కొనియాడారు.

Next Story