సంచలన పరిణామం.. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

by Malleboina Mahesh |

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధ పరిస్థితుల్లో జీ7 దేశాలు (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్) ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించాయి.

సంచలన పరిణామం.. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధ పరిస్థితుల్లో జీ7 దేశాలు (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్) ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించాయి. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ7 సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జీ7 నాయకులు ఇజ్రాయెల్‌కు స్వీయ రక్షణ హక్కు ఉందని, మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని జీ 7 దేశాలు తెలిపాయి. జూన్ 13 నుంచి కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌ను "ప్రాంతీయ అస్థిరత ఉగ్రవాదానికి మూలం"గా జీ7 దేశాలు ఆరోపించాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్‌పై జీ7 దేశాల సంయుక్త ప్రకటన చేశాయి. ఇరాన్‌ దాడులను విరమించుకోవాలని ప్రకటించాయి. ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని జీ-7 దేశాలు ముక్తకంఠంతో తెలిపాయి. అలాగే యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడనుందని, అంతా అప్రమత్తంగా ఉండాలని జీ-7 దేశాల సూచించాయి.

Next Story