ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే భవిష్యత్తుకు ప్రమాదం: ఖర్గే

by Malleboina Mahesh |

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి.

ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే భవిష్యత్తుకు ప్రమాదం: ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రజలు ఏకం కావడంలో విఫలమైతే, వారి తరువాతి తరం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. "ప్రజాస్వామ్యానికి చేసిన కృషికి గాంధీజీ, పండిట్ నెహ్రూలను మనం స్మరించుకోవాలి. కొంతమంది వ్యక్తులు.. స్వేచ్ఛ కోసం ఏమీ చేయలేదు కానీ తమను తాము గొప్ప దేశభక్తులమని చెప్పుకుంటారు." అని మల్లికార్జున్ ఖర్గే విమర్శలు చేశారు.

Next Story