Funeral: రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. అధికారిక ప్రకటన విడుదల

by Kema Shiva Kumar |

దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Former Prime Minster Manmohan Singh) (92) గురువారం రాత్రి కన్నుమూశారు.

Funeral: రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Former Prime Minster Manmohan Singh) (92) గురువారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఢిల్లీ (Delhi)లోని ఏయిమ్స్‌ (AIMS)లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే, ఇప్పటికే ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం (Central Government) అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం అంటే రేపు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లుగా అధికారులు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అదేవిధంగా మన్మోహన్ మృతికి సంతాప సూచికంగా ఏడు రోజులు పాటు సంతాప దినాలను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవతనం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ (Central Cabinet) సమావేశం కానుంది. ఆ సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి‌వర్గం సంతాపం తెలుపనుంది.

Next Story