Supreme Court: ఉచితాలకు నిధులున్నాయి కానీ, పరిహారం కోసం లేవా? మహారాష్ట్రపై మండిపడిన సుప్రీంకోర్టు

by S Gopi |
Supreme Court: ఉచితాలకు నిధులున్నాయి కానీ, పరిహారం కోసం లేవా? మహారాష్ట్రపై మండిపడిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అటవీ భూమిలో భవనాల నిర్మాణంపైనా, బాధిత పార్టీకి పరిహారం చెల్లించడంపైనా స్పందించని కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తప్పుబట్టింది. 'లాడ్లీ బెహనా', 'లడ్కా భావు' పథకాల కింద ఉచితంగా పంపిణీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయి కానీ, భూమిని పోగొట్టుకున్నవారికి చెల్లించేందుకు లేవని కోర్టు అభిప్రాయపడింది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆగస్టు 13 వరకు గడువు ఇచ్చింది. మహారాష్ట్రలోని అటవీ భూమిలో భవనాల నిర్మాణానికి సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఈ భూమిని కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఏఆర్‌డీఈఐ) ఆక్రమించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దాని ఆధీనంలో ఉన్న భూమికి బదులుగా మరో భూమిని ప్రైవేట్ పార్టీకి కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ తర్వాత ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయించిన భూమిని అటవీ భూమిగా నోటిఫై చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా.. 'జూలై 23 నాటి మా ఆర్డర్ ప్రకారం, అఫిడవిట్‌పై భూమి యాజమాన్యంపై మీ స్టాండ్‌ను తెలియజేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాము. ఉత్తర్వులను పాటించకపోతే, తదుపరి విచారణకు హాజరు కావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తామని కోర్టు వెల్లడించింది.



Next Story

Most Viewed