ఎన్నికల కోసమే ఇంధన ధరల పెంపును దాచారు: మల్లికార్జున ఖర్గే ఫైర్

by Malleboina Mahesh |

కేరళలో వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల భయంతోనే మోదీ ప్రభుత్వం ఇంధన ధరల పెంపును దాచిపెట్టిందని ఆరోపించారు.

ఎన్నికల కోసమే ఇంధన ధరల పెంపును దాచారు: మల్లికార్జున ఖర్గే ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్‌పై మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణం, ధరల పెంపు ప్రభావం పడితే తమకు ఎక్కడ ఎదురుదెబ్బ తగులుతుందోననే భయంతోనే మోడీ ప్రభుత్వం ఇన్నాళ్లూ ఈ ధరల పెంపును దాచిపెట్టిందని (Kept it hidden) ఆయన ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై భారం పడేలా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఒక్కసారిగా పెంచేశారని కేరళం వేదికగా ఖర్గే విమర్శించారు. ఒకవేళ ప్రధాని మోడీ ఈ ధరల పెంపును ఎన్నికలకు ముందే చేసి ఉంటే, ప్రజలు పోలింగ్‌లోనే బుద్ధి చెప్పేవారని ఖర్గే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story