ఓఆర్ఎస్ పదం వినియోగంపై FSSAI కీలక ఉత్తర్వులు

by Malleboina Mahesh |

“ORS” అనే పదం వినియోగంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ సంస్థ రద్దు చేసింది.

ఓఆర్ఎస్ పదం వినియోగంపై FSSAI కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: “ORS” అనే పదం వినియోగంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ సంస్థ రద్దు చేసింది. 2022 జూలైలో జారీ చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం, “ORS” (Oral Rehydration Salts) అనే పదాన్ని బ్రాండ్ పేర్లలో ఉపయోగించడంపై నియంత్రణలు విధించగా, 2024 ఫిబ్రవరిలో మరో ఆదేశం ద్వారా కొంత సడలింపులు ఇచ్చింది. అనంతరం WHO ఆమోదం పొందని ఉత్పత్తులు మాత్రమే “ORS” అనే పదాన్ని ఉపయోగించాలని స్పష్టమైన హెచ్చరిక, డిస్‌క్లెయిమర్ ఇవ్వాలని పేర్కొంది.

అయితే తాజాగా అక్టోబర్ 14న FSSAI గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అన్నింటినీ రద్దు చేస్తూ, “ORS” పదం వినియోగంపై ఉన్న అన్ని పరిమితులను తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే ఇప్పుడు “ORS” అనే పదాన్ని బ్రాండ్ పేర్లలో వాడేందుకు ప్రత్యేక ఆమోదం అవసరం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వినియోగదారులను తప్పుదారి పట్టించకూడదనే ఉద్దేశ్యంతో కంపెనీలు స్పష్టమైన లేబులింగ్, నిజమైన ఉత్పత్తి వివరాలను ఇవ్వడం అవసరమని FSSAI సూచించింది.

Next Story