‘100 శాతం’ అంటూ ప్రమోషన్స్ చేయొద్దు.. ఫుడ్ బిజినెస్‌లకు ఆదేశాలు!

by Phanindra |

‘100 శాతం’ అంటూ ప్రమోషన్స్ చేయొద్దని, ఇలా చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించినట్లేనని ఫుడ్ బిజినెస్‌లకు నిర్దేశాలు అందాయి.

‘100 శాతం’ అంటూ ప్రమోషన్స్ చేయొద్దు.. ఫుడ్ బిజినెస్‌లకు ఆదేశాలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆహార పదార్థాల లేబుల్స్, ప్రమోషన్స్‌లో ‘100 శాతం’ అనే పదాన్ని వాడొద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించింది. వినియోగదారులను ఇలాంటి మాటలు అయోమయానికి గురిచేస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అందుకే ఆహార పదార్థాల లేబుల్స్, ప్యాకేజింగ్, యాడ్స్‌పై ఇలాంటి ప్రకటను చేయొద్దని ఆహార పదార్థాల బిజినెస్ ఆపరేటర్లు (ఎఫ్‌బీవో)లకు సూచించింది. ఇటీవలి కాలంలో ‘100 శాతం’ అనే పదాన్ని ప్రమోషన్స్‌లో మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. ప్రస్తుత నిబంధనల్లో ఈ పదాన్ని వివరించలేమని, ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించినట్లవుతుందని అభిప్రాయపడింది.

Next Story