గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ... క్లారిటీ ఇచ్చిన FSSAI

by Ajay Maddhiboyina |

కోడగుట్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ... క్లారిటీ ఇచ్చిన FSSAI
X

దిశ, వెబ్ డెస్క్: కోడగుట్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మెటాబోలైట్స్ (AOZ) ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కోడిగుడ్లు తినేందుకు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రచారంపై FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది.

ఆహార భ‌ద్ర‌త మ‌రియు ప్ర‌మాణాలు 2011 ప్ర‌కారం కోళ్లు, గుడ్ల ఉత్ప‌త్తికోసం అన్ని ద‌శ‌ల్లో నైట్రోఫ్యూరాన్ల‌ను నిషేదించిన‌ట్టు పేర్కొంది. ఇండియాలో దొరుకుతున్న గుండ్లను ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా తినవచ్చు అని స్పష్టం చేసింది. గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్టు వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది. క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్టు ఇప్పటి వరకు శాస్త్రీయంగా నిరూపించబడలేదని వెల్లడించింది. గుడ్లు సుర‌క్షిత‌మైన‌, పోష‌కాలు క‌లిగిన ఆహారం అని స్పష్టం చేసింది.

Next Story