వాళ్లను ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి.. కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-28 09:53:00  IST  )

ఢిల్లీలో 'నీట్' (NEET) ఆందోళనలు.. విద్యార్థుల ప్రవర్తనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాళ్లను ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి.. కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నామని ఈ సందర్భంగా కంగనా గుర్తుచేశారు. అయితే, ‘నీట్’ (NEET) ఆందోళన ముసుగులో విద్యార్థులు మీడియా ముందే పచ్చి బూతులు మాట్లాడటం ఏ రకమైన సంస్కారమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అసలు అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలని ప్రశ్నించిన ఆమె.. వాళ్లు భవిష్యత్తులో సుప్రీంకోర్టులో న్యాయవాదులు అవుతారేమోనంటూ సెటైర్లు వేశారు. చివరకు అమ్మాయిలు కూడా నీచంగా మాట్లాడుతుంటే.. సమాజంలో ఏ తల్లిదండ్రులకైనా విలువ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలా ప్రవర్తించే వాళ్లు భవిష్యత్తులో తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను 16 ఏళ్ల వయస్సు నుంచే సొంతంగా కెరీర్ బిల్డ్ చేసుకున్నానని, కానీ ఈ విద్యార్థుల్లా ప్రవర్తిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. తాను ఇలా మాట్లాడినందుకు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసినా ఏమాత్రం పర్వాలేదని కంగనా రనౌత్ స్పష్టం చేశారు.

Next Story