- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Bank Nominees: బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురు.. నామినీలపై వచ్చే నెల నుంచి కొత్త రూల్స్
Bank Nominees: బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురు.. నామినీలపై వచ్చే నెల నుంచి కొత్త రూల్స్
by Prasad Jukanti |
బ్యాంకు ఖాతాదారుల నామినీల విషయంలో వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాంకు ఖాతా దారులకు నామినీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై బ్యాంకు ఖాతా దారులు ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలను (four nominees) నియమించుకునేందుకు అవకాశం కల్పించనుంది. నవంబర్ 1 నుంచి కస్టమర్లకు ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2025 ను ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సవరణలకు అనుగుణంగా కొత్త నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం డిపాజిటర్ల నామినీలకు క్లెయిమ్ ల పరిష్కారం సులభతరం కానుంది.
గతంలో ఒక ఖాతాకు (bank account) ఒకరినే నామినీగా నియమించుకునే అవకాశం ఉండేది. ఇక సేఫ్ కస్టడీ, సేఫ్టీ లాకర్లలోని వస్తువులకు నామినేషన్ కోసం, వరుస నామినేషన్లు మాత్రమే అనుమతించబడతాయి. అంటే ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా అవకాశం లభిస్తుంది. ఒకే నామినీ ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలా కాలం నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఖాతాదారు, నామినీ ఇద్దరు మరణిస్తే మరణించిన వ్యక్తి ఖాతాలోని సొమ్ము వారసులకు బదిలీ విషయంలో చట్టపరంగా చిక్కులు తలెత్తేవి. కొత్త నిబంధనల ప్రకారం నలుగురిని నామీనిగా ఎంచుకోవడంతో పాటు తన ఖాతాలోనీ ఆస్తిని శాతాల వారీగా నలుగురికీ కేటాయించే అవకాశం ఉండటంతో ఆ చిక్కులకు ఫుల్ స్టాప్ పడనుంది.
Next Story






