స్నేహం అంటే అత్యాచారానికి లైసెన్స్ కాదు ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

స్నేహం అంటే అత్యాచారానికి పాల్పడేందుకు లైసెన్స్ ఏమి కాదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

స్నేహం అంటే అత్యాచారానికి లైసెన్స్ కాదు ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్నేహం అంటే అత్యాచారానికి పాల్పడేందుకు లైసెన్స్ ఏమి కాదని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోక్సో చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు తాను ఇద్దరం ఇష్టపూర్వకంగానే మా బంధాన్ని కొనసాగించామని అయితే ఎఫ్ఐఆర్‍లో అవకతవకలు జరిగాయని అందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల నిందితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ జస్టిస్ స్వర్ణకాంత శర్మ (Justice Swarana Kanta Sharma) తిరస్కరించారు. బాధితురాలు, నిందితుడు స్నేహితులే అయినప్పటికీ బాధితురాలిపై పదే పదే అత్యాచారం చేయడానికి, స్నేహితుడి ఇంట్లో బంధించి, కనికరం లేకుండా కొట్టేందుకు స్నేహం అనేది లైసెన్స్ కాదని (friendship no licence to rape) వ్యాఖ్యానించారు. అలాగే ఎఫ్ఐఆర్ 11 రోజుల ఆలస్యంగా నమోదు అయిందని నిందితుడు చేసిన వాదనను కోర్టు తోసి పుచ్చింది. భయం, తన మనసుకు తగిలిన గాయం కారణంగా ఈ ఘటన గురించి తల్లితండ్రులకు చెప్పడానికి బాధితురాలు సంకోచించడం సహజమేనని కోర్టు వ్యాఖ్యానించింది.

Next Story