- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడల్ రేప్ కేసులో సిద్ధార్థ్ అరెస్ట్.. ఆయన అపార్ట్‌మెంట్‌లోనే అత్యాచారం.. ఇండస్ట్రీ నాపై పగబట్టిందంటూ..
ఫ్రెంచ్ మోడల్ రేప్ కేసులో నిందితుడు సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేశారు ఉదయపూర్ పోలీసులు. చిత్తోర్‌గఢ్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేసి .. ఈ కేసును త్వరగా క్లోజ్ చేస్తామని తెలిపారు.

దిశ, వెబ్‌సైట్ : ఫ్రెంచ్ మోడల్ రేప్ కేసులో నిందితుడు సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేశారు ఉదయపూర్ పోలీసులు. చిత్తోర్‌గఢ్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేసి .. ఈ కేసును త్వరగా విచారిస్తామని తెలిపారు. అయితే నిందితుడు మాత్రం తనను హనీ ట్రాప్ చేశారని.. ఇండస్ట్రీలో కొందరి చేతిలో బలిపశువయ్యానని చెప్తున్నాడు. తాను లొంగిపోయే టైమ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాడు.
అసలు ఏం జరిగింది?
కాగా ఫ్రెంచ్ మహిళ ఏప్రిల్ 17 నుంచి భారతదేశంలో ఉంది. జూన్ 22న ఢిల్లీ నుంచి ఉదయపూర్‌కు ఒక ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ యాడ్ షూట్ కోసం వెళ్లింది. అప్పటికే ఆమె ఢిల్లీలో నివసిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్, నటిగా పలు యాడ్స్‌లో పనిచేసింది. ఇక నిందితుడు పుష్పరాజ్ ఓజా అలియాస్ సిద్ధార్థ్.. చిత్తోర్‌గఢ్ నివాసి. కాగా ఉదయపూర్‌లో “కాస్టింగ్ కాల్” అనే టాలెంట్ ఏజెన్సీ నడుపుతున్నాడు. యాడ్ షూట్‌ల కోసం నటీనటులను నియమిస్తాడు. బాలీవుడ్ కోసం కూడా పనిచేస్తాడు. అతను బాధితురాలితో ఒకే షూట్ క్రూలో ఉన్నాడు.
జూన్ 22న, లేక్ పిచోలా, సజ్జన్‌గఢ్ ఫోర్ట్‌లలో యాడ్ షూట్ పూర్తయిన తర్వాత బాధితురాలు, సిద్ధార్థ్‌తో సహా క్రూ సభ్యులు టైగర్ హిల్‌లోని ది గ్రీక్ ఫామ్ కేఫ్ అండ్ రెస్ట్రోలో పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో సిద్ధార్థ్ బాధితురాలి టేబుల్ వద్దకు వచ్చి.. ఆమెతో బయటకు వచ్చి స్మోక్ చేయాలని, సమీపంలోని సీనిక్ స్పాట్‌లు చూపిస్తానని చెప్పాడు. నగరం మొత్తం తిప్పి చూపిస్తానని ఒప్పించాడు. ఆమె పదేపదే అంబమాట హోటల్‌కు తిరిగి తీసుకెళ్లాలని కోరినప్పటికీ.. సుఖేర్‌లోని తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే బాధితురాలి ఫోన్ బ్యాటరీ అయిపోయింది. దీంతో ఆమె ఎవరినీ సంప్రదించలేకపోయింది. ఫోన్ రీచార్జ్ చేయడానికి సహాయం కోరగా.. సిద్ధార్థ్ దానిని ఉపయోగించి ఆమెను ఉచ్చులోకి లాగాడు. నిరాకరించినప్పటికీ బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు హోటల్‌లో తిరిగి డ్రాప్ చేశాడు.
అయితే బాధితురాలు తన ఇద్దరు స్నేహితులకు ఈ ఘటన గురించి చెప్పింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఉదయపూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించిన స్నేహితులు.. పోలీసులను సంప్రదించారు. దీంతో బాధితురాలి ప్రాథమిక వాంగ్మూలం ఆధారంగా FIR నమోదు చేశారు పోలీసులు. సాక్ష్యాల కోసం వైద్య పరీక్ష నిర్వహించారు. అయితే సిద్ధార్థ్ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి అక్కడి నుంచి పారిపోగా.. రెండు రోజుల తర్వాత సొంత ఊరిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.






